News
ఎస్‌బీఐ రుణ రేట్లు తగ్గింపు
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రామాణిక రుణ రేటును 0.9శాతం తగ్గించింది. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే కొత్త వడ్డీరేట్లు(ఎంసీఎల్‌ఆర్) జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం ఏడాది కాలావధి రుణాలపై వడ్డీ రేటు 8శాతం అవుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు రూ.లక్షల కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మూడేళ్ల కాలావధి కలిగిన రుణాలపై వడ్డీ రేటును 9.05శాతం నుంచి 8.15శాతానికి తగ్గించింది. గతవారం స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్‌కోర్ 0.3శాతం, ఐడీబీఐ 0.6శాతం రుణ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








