News
టీఆర్‌ఎస్‌కు భారీ షాక్
అధికార టీఆర్‌ఎస్‌కు భారీషాక్ తగిలింది. వలసలను ప్రొత్సహిస్తూ టీఆర్‌ఎస్‌ను బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మిర్యాలగూడ జిల్లాలో మాత్రం టీఆర్‌ఎస్ ఎదురుదెబ్బ తగిలింది. సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలో దామరచర్ల జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు ఎంపీటీసీలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆరు నెలల క్రితం వీరంతా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెంట టీఆర్‌ఎస్ చేశారు. వీరి చేరికతో కాంగ్రెస్ శ్రేణులకు మంచి ఉత్సాహం వచ్చింది. టీఆర్‌ఎస్ సర్కారుకు కౌంట్‌డౌన్ మొదలయిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. 2019లో కాంగ్రెస్‌కు పట్టం కడితేనే ఆశించిన తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రధాని అనాలోచిత నిర్ణయమని, నోట్ల రద్దు వికార వికృత ప్రక్రియగా కొనసాగుతోందని ఉత్తమ్ ఉత్తమ్ ఆరోపించారు. బంగారు తెలంగాణ కాదని, భ్రష్టు పట్టిన తెలంగాణగా మారిందని, మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా జన్మిస్తానని సీఎల్పీ జానారెడ్డి వ్యాఖ్యానించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








