News

జగన్‌కు దేవినేని ఉమ సవాల్


జగన్...నీ సెంటరుకే వస్తున్నామంటూ మంత్రి దేవినేని ఉమ జగన్‌కు సవాల్ విసిరారు. సంక్రాంతికి ముందే పులివెందులకి కృష్ణా జలాలు తెస్తున్నామన్నారు. గండికోట నిర్వాసితులకు రూ.479 కోట్ల పరిహారం ఇస్తామని తెలిపారు. 2018కి పోలవరం ద్వారా నీరు అందిస్తామని, పోలవరం నిర్వాసితులు దేవుడుతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తామన్నారు. పోలవరం పూర్తయితే వైసీపీకి పుట్టగతులుండవని ఆయన ఎద్దేవాచేశారు. జనవరి 2న మచ్చుమర్రి ప్రాజెక్ట్‌ను, జనవరి 5న పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్‌ జాతికి అంకితం చేస్తారని దేవినేని ఉమ తెలిపారు.