News

జగన్‌ను భరించలేకే నేతలు వలసలు


జగన్‌ను భరించలేకే నేతలు వలసలు వస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. భూమనకు, ముద్రగడకు మధ్య సంబంధమేమిటో ప్రకటించాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి కూడా వలసలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ నెలాఖరులో మరో ఇద్దరు లేక ముగ్గురు టీడీపీలో చేరే అవకాశం ఉందని బుద్దా వెంకన్న తెలిపారు. జగన్‌కు రాష్ట్రాభివృద్ధిపై ఎలాంటి ఆకాంక్ష లేదని బుద్దా వెంకన్న మండిపడ్డారు.