News
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామాలైన సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పేదలకు కట్టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను శుక్రవారం ప్రారంభించారు. ఉదయం ఎర్రవల్లి చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. సామాజిక భవనాన్ని ప్రారంభించి.. అక్కడ నిర్వహించిన వాస్తు హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. గతేడాది విజయదశమి రోజు ముఖ్యమంత్రి ఈ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన ప్రత్యేక దృష్టి సారించడంతో కేవలం 14 నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 159 ఇళ్లల్లో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








