News

రాహుల్ ఇప్పుడిప్పుడే మాట్లాడ‌టం నేర్చుకుంటున్నాడు


ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప‌రిశోద‌న‌లను అంర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల‌ని అన్నారు. వార‌ణాసి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని కేన్స‌ర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగించారు. భార‌త్‌లో మాన‌వ‌వ‌న‌రుల‌కు లోటు లేద‌ని.. స‌రైన రీతిలో ఉప‌యోగించుకుంటే భార‌త‌దేశం ప్ర‌పంచ‌దేశాల స‌ర‌స‌న నిల‌బ‌డుతుంద‌ని తెలిపారు. స‌మాజంలో అవినీతిని శుభ్రం చేసేందుకే పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేశామ‌ని చెప్పారు. ఓ వైపు అవినీతిని త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంటే మ‌రోవైపు కొంద‌రు రాజ‌కీయ‌నాయ‌కులు అవినీతికి కొమ్ము కాస్తున్నార‌ని విమ‌ర్శించారు. దేశంలో అవినీతిని పార‌ద్రోలి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను శుభ్ర‌ప‌రిచే బాధ్య‌త తాను తీసుకుంటున్న‌ట్లు చెప్పిన ప్ర‌ధాని…త‌న నిర్ణ‌యాన్ని సామాన్య ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపి స్వాగ‌తించిన‌ట్లు గుర్తుచేశారు. మోడీ అవినీతికి పాల్ప‌డ్డాడంటూ తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసిన రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు ప్ర‌ధాని. రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే మాట్లాడ‌టం నేర్చుకుంటున్నాడ‌ని అందుకు చాలా సంతోషంగా ఫీల‌వుతున్న‌ట్లు మోడీ అన్న‌ప్పుడు స‌భ‌లో న‌వ్వులు విరిశాయి. పార్ల‌మెంట్‌లో మాట్లాడితే భూకంపం వ‌స్తుంద‌ని చెప్పిన రాహుల్ సంగ‌తి అంద‌రికీ తెలిసిందేనన్నారు ప్ర‌ధాని. దేశంలో పేద‌రికానికి కార‌ణం కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని ప్ర‌ధాని మండిప‌డ్డారు. ఎవ‌రి ప్ర‌భుత్వంలో అవినీతి చోటుచేసుకుంద‌ని సూటిగా ప్ర‌శ్నించారు.