News

ఉబెర్‌మోటో ప్రారంభించిన కేటీఆర్‌


తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ గచ్చిబౌలిలోని టీహబ్‌లో ‘ఉబెర్‌మోటో’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉబెర్‌ ఇండియా ఎండీ అజిత్‌ జైన్‌, మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి మధ్య ఒప్పందం కుదిరింది. నగరంలో ఉబెర్‌ మోటో నడిపేందుకు వీరిద్దరి మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉబెర్‌ సీఈవో ట్రావిస్‌ కననోవిక్‌, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.