News

10 మంది మత్స్యకారులు గల్లంతు


వార్దా తుపాన్ గురించి ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా లాభం లేకుండా పోయింది. సముద్ర తీరంలో వేటకు వెళ్లిన 10 మంది మత్స్యకారులు గల్లంతు అయినట్లుగా సమాచారం. మత్స్యాకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు చేస్తునే ఉన్నారు. దీనిపై అధికారికంగా పూర్తి సమాచారం అందవలసి ఉంది. కాగా చెన్నైలో 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగాఉన్నాయి. విశాఖ నుంచి రెండు నౌకలు ఐఎన్‌ఎస్‌ శివానిక్‌, ఐఎన్‌ఎస్‌ కడ్మెట్‌ చెన్నై బయల్దేరాయి. నౌకల్లో రబ్బరు బోట్లు, గజ ఈతగాళ్లు ఉన్నారు. చెన్నైలో సోమవారం ఉదయం నుంచి 8 సెం.మీటర్ల వర్ష పాతం నమోదు అయింది. మరో 7 సెం.మీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరువళ్లూరు ప్రాంతంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. పౌర్ణమి కారణంగా అలల ఉదృతి అధికంగా ఉంది.