News

ఎయిర్‌ ఏషియా విమానానికి తృటిలో ప్రమాదం


హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్తున్న ఎయిర్‌ ఏషియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 167 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో టేకాఫ్‌ తీసుకున్న కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు ఏటీసీ అధికారులకు సమాచారం అందించి అత్యవసరంగా శంషాబాద్‌లో ల్యాండింగ్ చేశారు. విమానానికి మరమ్మతుల అనంతరం కౌలాలంపూర్‌ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.