News

కరాటే చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాదించిన వరుణ్


హైదరాబాద్: సంద వరుణ్ సాగర్(8) అనే బాలుడు కర్మన్‌ఘాట్, దిల్షుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు కరాటే శిక్షన కూడా తీసుకున్నాడు. గుంటూరులో జరిగిన నేషనల్ కరాటే చాంపియన్‌షిప్ 2016లో గోల్డ్ మెడల్ సాదించాడు. దాంతో పాటు తెలంగాణ స్టేట్ లెవెల్  చాంపియన్‌షిప్‌లో కూడా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సలహాదారులు గడ్డం వివేకానంద్ గారు వరుణ్‌ను ప్రశంసించారు. వరుణ్ సాగర్ కరాటేలోనే కాదు, చదువులో కూడా ముందుంటాడు...