News

తెరాస నేతపై అరెస్టు వారెంట్‌


తెరాస నాయకుడు డి.సతీశ్‌రెడ్డిపై అరెస్టు వారెంట్‌ జారీ అయింది. భువనేశ్వర్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీచేయడంతో సతీశ్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ఒడిశా పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారు. భువనేశ్వర్‌లో వ్యాపారి సుభాష్‌ అగర్వాల్‌ కిడ్నాప్‌ కేసులో సతీశ్‌రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయనకు సుప్రీం కోర్టు సైతం బెయిల్‌ మంజూరును రద్దుచేసింది.