News

నానక్‌రాంగూడ ఘటనలో 11 మంది మృతి


హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో గురువారం రాత్రి కుప్పకూలిన ఏడు అంతస్తుల భవనం శిథిలాల నుంచి మృతదేహాల వెలికితీత పూర్తైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. 11 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. అధికారుల పర్యవేక్షణలో సహాయ సిబ్బంది గురువారం రాత్రి నుంచి నిర్విరామంగా శ్రమించి శిథిలాల నుంచి మృతదేహాలను శుక్రవారం అర్ధరాత్రికి వెలికితీయగలిగారు. మంత్రి కేటీఆర్‌, మేయర్‌ రామ్మోహన్‌ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ చివరి వరకూ ఘటనాస్థలిలోనే ఉండిపోయారు. మృతదేహాలను పంచనామా అనంతరం వారి స్వస్థలాలకు పంపిస్తామని.. మృతుల బంధువులు కూడా వారి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఏర్పాట్లు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.