News

అమిత్‌షా జైలుకు వెళ్లేవారు


ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ కానిపక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జైలుకు వెళ్లేవారని, హంతకులకు కాంగ్రెస్‌ పార్టీని, ప్రభుత్వాలను విమర్శించే నైతికత లేదని సీఎం సిద్దరామయ్య విమర్శించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన బీసీ మోర్చా ఐక్యసదస్సులో పాల్గొన్న అమితషా, కర్ణాటకలో ప్రభుత్వ శవపేటిక వద్ద నగారా మోగిస్తున్నామని దేశంలో కర్ణాటక అవినీతి రాష్ట్రంగా పేరొందిందని ఆరోపించిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య సోమవారం ఘా టుగా స్పందించారు. నోట్లు లెక్కపెట్టే యంత్రాలు ఇంట్లో పెట్టుకున్న గొప్పవారిని పక్కన కూర్చోబెట్టుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుందని ఆరోపించే హక్కు లేదన్నారు. నోట్లరద్దుతో ప్రజలను ఇబ్బంది కలిగించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు.