News

రివర్స్‌ గేర్‌ ఉండకూడదు


నిజామాబాద్‌ ఎంపీ కవిత జీవితంలో రివర్స్‌ గేర్‌ ఉండకూడదని ఎన్ని ఇబ్బందులెదురైనా ధైర్యాన్ని వీడవద్దని అన్నారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ నగర పంచాయతీ కిష్టాపూర్‌ పరిధిలో గల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల రాష్ట్ర స్థాయి సొషల్‌ వెల్ఫేర్‌ హీరోస్‌ (స్వేరోలంపిక్స్‌)ను ఎంపీ కవిత, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నిజామాబాద్‌ ఎంపీ కవిత మాట్లాడుతూ విద్యార్థినిలు అన్ని పోటీల్లో రాణించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం ఉన్న గ్రామీణ క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఎంపీ కవిత విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ ఆడారు. మూడు రోజులు జరిగే ఈ స్వేరోలంపిక్స్‌లో 1200 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సాంఘీక సంక్షేమ వసతి గృహాల రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌. జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ బి.ప్రభాకర్‌రెడ్డి, మేడ్చల్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సత్యనారాయణ, ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్‌లు కందాడి నరేందర్‌రెడ్డి, దేశం నారాయణగౌడ్‌, రాజమల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.