News
హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన
గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని పరిపాలనా భవనం ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. శుక్రవారం వర్సిటీలో పరిశోధనా విద్యార్థి అబ్రహం ఆత్మహత్యాయత్నానికి కారకుడైన గైడ్ వైజీశ్వరన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మచిలీపట్నానికి చెందిన అబ్రహంకు సరైన్ గైడెన్స్ ఇవ్వకుండా పలు విధాలుగా మానసికంగా ఒత్తిడిచేయడంతోనే అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అబ్రహం ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా గమనించిన తోటి విద్యార్థులు అతడ్ని సమీపంలోని ఆశా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అబ్రహం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








