News

గూగ్లుల్‌లో మార్పులు


గూగుల్‌‌ను పర్యవేక్షించేందుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. గూగుల్‌తో పాటు యాహూ, మైక్రోసాఫ్ట్ తదితర సెర్చ్ ఇంజన్లపై నిఘా పెట్టాలని సూచించింది. అంతేకాదు, లింగ నిర్ధారణకు సంబంధించిన కీ వర్డ్స్‌ను, సమాచారాన్ని 36 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అని ముందే తెలుసుకోవడం చట్టరీత్యా నేరమని టీవీలు, రేడియోల ద్వారా విస్తృత ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. లింగ నిర్ధారణ చేసుకోవాలంటే సంప్రదించాలంటూ సెర్చ్ ఇంజన్లలో వచ్చే ప్రకటనలను 36 గంటల్లో నిలిపివేయాలని ఆదేశించింది. అలా తొలగించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీపక్ మిశ్రా, అమితవ రాయ్ బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది. భ్రూణ హత్యలను నివారించేందుకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.