News
విద్యుత్ షాక్ తగిలి కూలీ మృతి
భవన నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలకు విద్యుత్ షాక్ తగిలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణంలోని నీరుగట్టువారి కాలనీలో ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో కూలి పని చేస్తున్న కుల్ల శేఖర్(50) విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. అతనిని రక్షించడానికి యత్నించిన ఓబుల్‌రెడ్డి, జి.శేఖర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తుమ్మనగుట్ట పంచాయతి పరిధిలోని సెగలేటివారిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








