News

మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత బాబుదే


వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని విమర్శించారు. ఇంటింటికీ పాల ప్యాకెట్‌ల మాదిరిగా మద్యం ప్యాకెట్‌లను సరఫరా చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారని ఆయన అన్నారు. అడుగడుగునా ఉన్న మద్యం షాపులతో యువత నిర్వీర్యం అవుతుందన్న భూమన.. ఆదాయం కోసం ఎన్ని తప్పులు చేయడానికైనా చంద్రబాబు సిద్ధం అన్నారు. బీచ్‌లలోనూ మద్యం షాపులు పెట్టి మన సంస్కృతిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.