News

పనికి మాలిన ప్రతిపక్షనేత ఉన్నారు


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప.గో జిల్లా పర్యటనలో భాగంగా తణుకులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అద్భుతమైన ముఖ్యమంత్రి ..పనికి మాలిన ప్రతిపక్షనేత ఉన్నారని వ్యాఖ్యానించారు. రెండు కులాల మధ్య, జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రతిపక్షం చూస్తోందని మండిపడ్డారు. ప్రజల కష్టాలు తీర్చడానికి, రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని లోకేష్ స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమానికి రెండు రోజలు వెళ్లకుంటే తనకు మానాన్నకు గొడవలు అన్నారని, సంస్థాగత అంశాలు మాట్లాడుకుంటే చినరాజప్పను ఏదో అన్నానని ప్రచారం చేశారని లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లా పర్యటనలో భాగంగా లోకేష్ తణుకు పట్టణం నుంచి వేల్పూరు వరకు ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు. అలాగే ప్రజలు, విద్యార్ధులతో ఆయన సమావేశం కానున్నారు. లోకేశ్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.