News

ఎన్నికల కమిషన్‌కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు


టీటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విభజన చట్టానికి విరుద్ధంగా జిల్లాలను విభజించారంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసారు. అసెంబ్లీ డీలిమిటేషన్‌ జరుగకముందే షెడ్యూల్ 5 పరిధిలోని గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాల్లో విలీనం చేసారని కేసీఆర్‌పై రాష్ట్రపతితో పాటు ప్రధానికి కూడా కంప్లైంట్ చేసారు. కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక రాజకీయ కుట్ర ఉందని రేవంత్‌ ప్రధానంగా ఆరోపించారు.