News

జగన్‌కు గంటా సవాల్


మంత్రి గంటా శ్రీనివాసరావు అభివృద్ధిపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందుందని కేంద్రం ప్రకటించిందన్నారు. పరిశ్రమలు, ఉపాధి కల్పనపై బహిరంగ చర్చకు సిద్ధామా అని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఇచ్చే లెక్కలు తప్పని నిరూపిస్తే శిక్షకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. నిరూపించకపోతే జగన్ శిక్షకు సిద్ధపడాలని మరోసారి సవాల్ విసిరారు. చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేసే నైతిక అర్హత జగన్‌కు లేదని, జగన్ తీరు మారకుంటే వైసీపీకి ప్రతిపక్షహోదా కూడా దక్కదని గంటా శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు.