News

మాల్యాకు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్


ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా మారిన విజయ్ మాల్యాకు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో మాల్యాపై వారెంట్ జారీ అయ్యింది. గతంలో కూడా మాల్యాపై ఒక నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉంది. మాల్యాకు చట్టంపై గౌరవం లేదని, అందుకే ఆయన తప్పించుకు తిరుగుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. మాల్యాకు అసలు భారత్ తిరిగి వచ్చే ఉద్దేశమే లేదని, పిటిషన్లు, కౌంటర్లతో ఆయన కాలయాపన చేస్తున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది.