News

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణలో జరుగుతున్న హోంగార్డుల పోరాటానికి సానుకూలంగా స్పందించారు.  హోంగార్డుల ఉద్యమంపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారంలోకి వస్తే పర్మినెంట్‌ చేస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సాటి పోలీసులతో హోంగార్డులపై దాడి చేయించడం అమానుషమన్నారు. హోంగార్డుల సర్వీసును క్రమబద్దీకరించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులతో సమానంగా వేతనం, ఆరోగ్య భద్రత కల్పించాలని, ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే హోంగార్డులకు 30శాతం అదనపు అలవెన్స్‌, వారాంతపు సెలవులు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. లేదంటే హోంగార్డులకు మద్దతుగా పోరాటం చేస్తానని రేవంత్ లేఖలో హెచ్చరించారు.