News

జగన్‌ బహిరంగ సభ పోస్టర్లు విడుదల


నవంబర్‌ 6న వైసీపీ నేతలు విశాఖలో జగన్‌ చేపట్ట తలపెట్టిన ‘జై ఆంధ్రప్రదేశ్‌’ బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు చేసిన వాగ్ధానాలేవీ నెరవేర్చలేదని వైసీపీ సీనియర్‌ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అయితే ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారాయన. సర్కార్‌ తీరును నిరసిస్తూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ‘జై ఆంధ్రప్రదేశ్‌’ బహిరంగ సభల్ని ఏర్పాటు చేసి సర్కార్‌ తీరును ఎండగడతామన్నారు వైసీపీ నేతలు.