News
కేసీఆర్ జీవితంపై వర్మ చిత్రం
వాస్తవ కథలను సినిమాలుగా తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంపై సినిమాను తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్మ ప్రకటన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు, కేసీఆర్‌లో ఎవరికీ తెలియని కోణాన్ని సినిమాలో చూపించబోతున్నట్లు ప్రకటించిన వర్మ చర్చకు దారితీశాడు. తాజాగా ఈ సినిమాపై వర్మ మరో ట్వీట్ చేశాడు. కేసీఆర్ సినిమాకు సంబంధించి త్వరలో కేటీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించబోతున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు. అయితే ఎప్పుడు కలిసేది, ఏఏ విషయాలపై చర్చించేది వర్మ ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ వంగవీటి, నయీమ్, ఆర్‌సీకే(కేసీఆర్‌పై తీయబోతున్న సినిమా పేరు) సినిమాలతో వర్మ మరోసారి తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








