News

పోలీసులకు ఉచితంగా సేవలు


డీజీపీ సాంబశివరావు విజయవాడలోని వంద మంది పోలీసులలో 37మందికి వృత్తి పరంగా అనారోగ్యసమస్యలు ఉన్నాయన్నారు. విజయవాడలో పోలీసులకు డీప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉచితంగా వైద్య శిబిరంలో పాల్గొన్న ఆయన… పోలీసులకు ఉచితంగా సేవలను అందించటం అభినందనీయమన్నారు. ప్రతి ఎడాది పోలీసులకు మాస్టర్‌ హెల్త్‌ చెక్‌అప్‌లను చేయించేందుకు త్వరలోనే సీఎంతో ప్రకటన చేయిస్తామన్నారు. అలాగే ఉత్తమ సేవలను అందించిన పోలీసులకు గుర్తింపు సర్టిఫికెట్లతో పాటు వారి కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.