News

కేసీఆర్‌ ఆదేశిస్తే రాజీనామే


సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే రాజీనామాకు సిద్దం అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. సరస్సులో పువ్వాడ అజయ్‌ ఆక్రమించిన భూమిని ప్రభుత్వం క్రమబద్దీకరించిందని సుధాకర్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఖమ్మం జిల్లాలో 2.5 ఎకరాల భూమిలో చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆపాలని, మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, రూ. 2.10 కోట్లు చెల్లించి మమతా కాలేజీ పక్కన స్థలాన్ని జీవో 59 ప్రకారం క్రమబద్దీకరించుకున్నామని తెలిపారు. తమ కాలేజీ ఆవరణలో ఎలాంటి సరస్సులు లేవని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.