News

కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ముద్దుకృష్ణ


ఎన్టీఆర్‌ స్ఫూర్తితో జిల్లాలు విభజిస్తున్నామని కేసీఆర్‌ చెప్పడం హర్షణీయమని టీడీపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఏదో ఒక కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించింది ఎన్టీఆరేనని ఈ సందర్భంగా గాలి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్‌ బీసీ హాస్టళ్లు ప్రారంభిస్తున్నారని ముద్దుకృష్ణమ తెలిపారు.