News

సిలిండర్‌ కావాలంటే ఆధార్‌ ఉండాలి


సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ కావాలంటే ఆధార్‌ తప్పనిసరి. నవంబరు నుంచి ఆధార్‌ లేకపోతే సిలిండరు ఇవ్వరు. ఈ మేరకు కేంద్ర చమురు, పెట్రోలియం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ఎల్పీజీ రాయితీ సిలిండర్లు తీసుకోవాలనుకునే వ్యక్తులు ఆధార్‌ నెంబరును సమర్పించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొం ది. ఆధార్‌ కార్డు లేనివాళ్లు దానిని తీసుకోవడానికి రెండు నెలల సమ యం ఇచ్చింది. నవంబరు 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలంది.