News

జగన్‌పై ఎపి మంత్రులు విమర్శలు


ఎపి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప తాము రాయలసీమను రతనాల సీమ చేయాలని ప్రయత్నిస్తుంటే, విపక్ష నేత జగన్ దానిని కరవు సీమగా ఉంచాలని అనుకుంటున్నారని విమర్శించారు. అనంతపురంలో జగన్ కరువు దీక్ష చేయడాన్ని వారు తప్పు పట్టారు. అసలు జగన్ కు కరవు అంటే ఏమిటో తెలుసా అని వారు ప్రశ్నించారు.రాయలసీమ అబివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని, కాని జగన్ మాత్రం కరువు సీమగానే ఇది మిగలాలని కోరుకుంటున్నారని వారు అన్నారు.రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు చెప్పారు. అనంతపురం జిల్లాలో ఇన్ పుట్ సబ్సిడీగా ఐదు వందల కోట్లు ఇచ్చామని వారు అన్నారు. జగన్ కావాలంటే ఆ వివరాలు చూపిస్తామని వారు చెప్పారు.