News

ఎన్‌టీఆర్‌ను గుర్తు చేసిన కెసిఆర్


మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దివంగత గుర్తు చేసుకున్నారు. ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మండల వ్యవస్థను ఏర్పాటు చేయాలని తలపెట్టారని, అప్పుడు ఏర్పాటు చేసిన కమిటీలో తాను కూడా సభ్యుడని ఆయన అన్నారు.టిఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం అయిన సందర్భంగా ఆ విషయాలను తెలిపారు.మండల వ్యవస్థను పలువురు వ్యతిరేకించారని, అయినా ప్రజలకు సౌలబ్యంగా ఉంటుందని బావించి, దానిని ఏర్పాటు చేయడం జరిగిందని కెసిఆర్ తెలిపారు. దాంతో అది బ్రహ్మండంగా విజయవంతం అయిందని కెసిఆర్ అన్నారు. రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు అవకాశాలు వచ్చాయని, అనేక మంది కొత్త నేతలు తయారు అయ్యారని కెసిఆర్ వివరించారు.