News

కేసీఆర్‌పై షబ్బీర్ అలీ విమర్శలు


ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని షబ్బీర్‌అలీ ఆక్షేపించారు. కేసీఆర్ మాటమీద నిలబడరు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. కొత్త జిల్లాలపై అఖిలపక్షం పెడతామని కేసీఆర్ మాట తప్పారని షబ్బీర్‌అలీ తెలిపారు. నిమజ్జనం తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెడతామని కేసీఆర్ మాట తప్పారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్‌కు గౌరవంలేదని షబ్బీర్‌అలీ చెప్పారు.