News

పాకిస్థాన్‌లో భూకంపం


పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. భారత్-పాకిస్థాన్ బోర్డర్‌లో జమ్మూ, కశ్మీర్‌లో శనివారం మధ్యాహ్నం పలుచోట్ల భూమి కంపించింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భూ ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ముజఫర్రాబాద్, పెషావర్, గిల్‌గిట్, చిలాస్‌లో కూడా భూమి కంపించిందని, అయితే ఎటువంటి నష్టమూ సంభవించలేదని పాక్ లోకల్ మీడియా పేర్కొంది.