News
పాక్ సైన్యం చెరలో భారత సైనికుడు
పాక్ సైన్యం చెరలో భారత సైనికుడు చందూలాల్ చిక్కుకున్నాడు. పొరపాటున సరిహద్దు దాటిన భారత సైనికుడిని విడిచిపెట్టాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇప్పటికే పాక్‌ను కోరారు. పాక్ ఇంతవరకూ ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఈ జవాను నిన్న భారత సైన్యం ఉగ్రవాదులపై చేసిన దాడిలో పాల్గొనలేదని పొరపాటున ఈరోజు ఉదయం సరిహద్దు దాటాడని తెలిసింది. అయితే తోటి సైనికుడు పాక్‌కు చిక్కడంతో సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నేస్తానికి ఏం జరగకూడదని కోరుకుంటున్నారు. పాక్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆ సైనికుడి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








