News

పాక్‌ సైన్యం చెరలో భారత సైనికుడు


పాక్‌ సైన్యం చెరలో భారత సైనికుడు చందూలాల్‌ చిక్కుకున్నాడు. పొరపాటున సరిహద్దు దాటిన భారత సైనికుడిని విడిచిపెట్టాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇప్పటికే పాక్‌ను కోరారు. పాక్ ఇంతవరకూ ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఈ జవాను నిన్న భారత సైన్యం ఉగ్రవాదులపై చేసిన దాడిలో పాల్గొనలేదని పొరపాటున ఈరోజు ఉదయం సరిహద్దు దాటాడని తెలిసింది. అయితే తోటి సైనికుడు పాక్‌కు చిక్కడంతో సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నేస్తానికి ఏం జరగకూడదని కోరుకుంటున్నారు. పాక్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆ సైనికుడి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.