News

స్వచ్ఛభారత్‌ అందరి కార్యక్రమం


దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో పారిశుద్ధ్య సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, అమృత్‌ నగరాల మున్సిపల్‌ కమిషనర్లు హాజరయ్యారు. స్వచ్ఛ భారత్‌లో విశేష సేవలందించిన ఎన్‌సీసీకి ప్రధానమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛతా పురస్కారం ప్రదానం చేశారు. ఎన్‌సీసీ తరఫున మేజర్‌ జనరల్‌ పురస్కారం అందుకున్నారు. చెత్త నిర్వహణలో పుణె పట్టణానికి స్వచ్ఛతా పురస్కారం దక్కింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా సేవలందించిన పలువురికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. అన్ని పనులు ప్రభుత్వం చేస్తుందని వదిలేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇస్తోందని, ఆ తర్వాత పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. పరిపాలన నైపుణ్యాలు లేకపోతే లక్ష్యాలు చేరుకోలేమని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్‌ అందరి కార్యక్రమనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.