News

కేసీఆర్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం


కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ ఎదుట ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జిల్లాలోని మహదేవ్‌పూర్‌ మండలం ఎడపల్లి గ్రామానికి చెందిన గోపి అనే యువకుడు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యలను చెప్పుకోవడానికి కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రావాల్సింది. అయితే వరద కారణంగా సీఎం కార్యక్రమం వాయిదా పడింది. ప్రజావాణి రద్దు కావడంతో కలెక్టరేట్‌లోని మూడవ అంతస్థులో అధికారులతో  కేసీఆర్ సమావేమయ్యారు. సీఎం కార్యక్రమాన్ని ముగించుకుని వస్తున్న సమయంలో గోపి ముందుగా తెచ్చుకున్న మురుగులమందు తాగి సీఎం వద్దకు వచ్చాడు. సీఎం ఆదేశాల మేరకు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గోపి ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీతో కేసీఆర్ మాట్లాడారు. అయితే గోపికి ఎలాంటి ప్రాణాప్రాయస్థితి లేదని వైద్యులు తెలిపారు.