News
కేసీఆర్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం
కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఎదుట ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జిల్లాలోని మహదేవ్పూర్ మండలం ఎడపల్లి గ్రామానికి చెందిన గోపి అనే యువకుడు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యలను చెప్పుకోవడానికి కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రావాల్సింది. అయితే వరద కారణంగా సీఎం కార్యక్రమం వాయిదా పడింది. ప్రజావాణి రద్దు కావడంతో కలెక్టరేట్లోని మూడవ అంతస్థులో అధికారులతో కేసీఆర్ సమావేమయ్యారు. సీఎం కార్యక్రమాన్ని ముగించుకుని వస్తున్న సమయంలో గోపి ముందుగా తెచ్చుకున్న మురుగులమందు తాగి సీఎం వద్దకు వచ్చాడు. సీఎం ఆదేశాల మేరకు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గోపి ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీతో కేసీఆర్ మాట్లాడారు. అయితే గోపికి ఎలాంటి ప్రాణాప్రాయస్థితి లేదని వైద్యులు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








