News

పోలీస్‌స్టేషన్‌‌‌ కూల్చేయాలంటూ నోటీసులు


నగరంలోని శిథిలావస్థలో ఉన్న రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌‌‌ భవనంను కూల్చేయాలంటూ జీహెచ్‌ఎంసీ నోటీసులిచ్చింది. పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో ఉండటంతోనే ఈ నోటీసులు జారీ చేశామని వీలైనంత త్వరలో ఈ ప్రక్రియ ముగించాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. కాసేపట్లో శిథిలావస్థలో ఉన్న పీఎస్‌ భవనాన్ని మంత్రి తలసాని పరిశీలించనున్నారు. అయితే పీఎస్‌‌లోని అన్ని వస్తువులు మరోచోటికి తరలించేందుకు కాస్త సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇవాళ సాయంత్రం భవనాన్ని కూల్చివేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పీఎస్ భవనం కూల్చిన తరువాత తదుపరి పోలీస్ స్టేషన్ భవనం ఎక్కడ అనేది అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.