News

దివాకర్‌ రెడ్డిపై మేయర్‌ సంచలన వ్యాఖ్యలు


ఎంపీ దివాకర్‌ రెడ్డిపై కుల పిచ్చి మాకు లేదంటూ అనంతపురం నగర మేయర్‌ స్వరూప ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు, కలెక్టర్‌ నుంచి కమిషనర్‌ దాకా ఒకే సామాజిక వర్గం వారిని నియమించుకున్నారని గుర్తుచేశారు. కార్పొరేషన్‌లో అవినీతిపై మాట్లాడే అర్హత దివాకర్‌రెడ్డికి లేదన్నారు. ఎంపీ దివాకర్‌ రెడ్డిపై పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్వరూప తెలిపారు.