News

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబర్‌ 16లోపు ఎన్నికలు నిర్వహించండి


జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. ఆరు నెలల్లోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫోరమ్‌ఫర్‌గుడ్‌గవర్నెన్స్‌ పద్మనాభరెడ్డి వేసిన పిటిషన్‌ ఆధారంగా విచారణ జరిపిన కోర్టు 27 ఎప్రీల్ (సోమవారం)  ఉదయం ఈమేరకు తీర్పును వెలువరించింది. అక్టోబర్‌ 31లోగా వార్డుల విభజన రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి మరో 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆరు నెలలకు మించి గడువు కావాలని ప్రభుత్వం తరపున లాయర్‌ కోర్టును కోరారు. ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన ఉన్నందున అదనపు సమయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. 225 రోజుల గడువు ఇస్తున్నామని ఆలోపు ఎలక్షన్స్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నామని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రకాష్‌గౌడ్‌ తెలిపారు.