News

టీడీపీతో కలిశామనటం సరికాదు


కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలంగాణలో తాము తెలుగుదేశం పార్టీతో కలిశామనటం సరికాదని అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపాయన్న ఆయన, ఈ కారణంతో తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ కలిసిందనడం సరికాదన్నారు. ఓటుకు నోటు కేసులో క్విడ్ ప్రో జరిగిందని ఆరోపించారు. పట్టిసీమను, పోలవరాన్ని సమర్ధించింది కేసీఆరేనన్న జీవన్‌రెడ్డి... 2013 భూ సేకరణ చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వాస్తవాలను వక్రీకరిస్తోందని ఆరోపించారు.