News

పవన్‌‌కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి


సీపీఐ నేత సురవరం సుదాకర్‌రెడ్డి ఏపీకి హోదా ఇవ్వడం ఇష్టం లేకనే కేంద్రం ఆర్థికసంఘాన్ని సాకుగా చూపుతోందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సిఫారసులు మాత్రమే చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నవారు ప్యాకేజీ కావాలని ముందుగానే ఎందుకు డిమాండ్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు జనసేన నేత పవన్‌‌కల్యాణ్  క్షమాపణలు చెప్పాలని సురవరం సుదాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.