News

టీటీపీ ఎంపీ అవంతి నిరసన దీక్ష


టీటీపీ ఎంపీ అవంతి విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఎండలో నేలపై బైఠాయించారు. విశాఖకు రైల్వేజోన్‌ ఇచ్చేదాకా పార్లమెంట్‌కు వెళ్లనని పట్టుబట్టారు. రైల్వేజోన్‌ సాధన కోసం ఉద్యమిస్తామని, ఉద్యమానికి పార్టీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు.