News

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ


టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జిల్లాల విభజన చేయాలని, జనగామ జిల్లాపై తానిచ్చిన హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాలు ఉండాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఒక నియోజకవర్గంలోని మండలాలన్ని ఒకే జిల్లాలో ఉండాలని, కొత్త మండలాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. అంతర్ జిల్లా ప్రాజెక్టులపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రజలు కోరుకోని జిల్లాలను తక్షణమే రద్దు చేయాలని లేఖలో రేవంత్‌ స్పష్టం చేశారు. అఖిలపక్షం సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదికను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.