News
కేజ్రీవాల్‌పై అన్నా హజారే అసంతృప్తి
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఢిల్లీ రాష్ట్ర అధికార పక్షం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతుండటం, జైళ్లకు వెళ్లడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్పందించారు. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై తాను పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు జైలుకు వెళ్లడం, మరికొందరిపై ఆరోపణలు రావడం బాధ కలిగిస్తోందని అన్నారు. కేజ్రీవాల్ తనతో ఉన్నప్పుడు గ్రామ్ స్వరాజ్ పేరుతో ఒక పుస్తకం రాశారని తెలిపిన హజారే.. గ్రామ్ స్వరాజ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ చాలా ఏళ్లు తనతో ఉన్నారని, రాజకీయాల్లో ఆయన సరికొత్త ఒరవడిని తీసుకువస్తారని ఆశించానని హజారే పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన సహచరులు చేస్తున్న పనులు, ముఖ్యంగా కొందరు జైలుకు వెళ్లడం, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం తనకు చాలా బాధ కలిగించిందని హజారే చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








