News

జపాన్‌లో భారీ భూకంపం


జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. హోంషులోని హచినోహే వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.  రిక్టర్‌స్కేలుపై తీవ్రత 6గా నమోదైంది. మియాకో నగరానికి 167 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది. జపాన్‌లో నిన్నకూడా భూమి కంపించింది. ఫుకుషిమా దక్షిణ ప్రాంతంలోని ఇబారకీ తీరం వెంబడి 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.