News

టీఆర్ఎస్‌లోకి పొన్నం ప్రభాకర్


తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పొన్నం సోదరుడి కుమారుడు హుజూరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి పొన్నం కూడా పాల్గొన్నారు. ఇంకేముంది పొన్నం పార్టీ మార్పుపై గుస‌గుస‌లు జోరందుకున్నాయి. అయితే  వాస్త‌వానికి ఎంపీ సుఖేంద‌ర్‌రెడ్డితో పాటే పొన్నం పార్టీ మార‌తార‌ని అంద‌రూ అనుకున్నారు.  అయితే ప్ర‌స్తుతం క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్న బి.వినోద్‌కుమార్ అభిప్రాయం తీసుకున్నాకే పొన్నం టీఆర్ఎస్ లో చేరడానికి  కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని పలువురి నేతల అభిప్రాయం.