News
రిపోర్టర్‌నని అంటూ అబద్ధం చెప్పి
మీడియాల పేర్లు చెప్పి నగరంలోని పలు ప్రాంతాల్లో బ్లాక్‌మెయిలింగ్‌తో డబ్బు వసూలు చేస్తున్న నకిలీ విలేకరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ధరణి బాబు తెలిపారు. కర్నూలుకు చెందిన డాలు సుబ్బరాయుడు అదే ప్రాంతంలోనే కొన్నేళ్ల కిందట ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి వివాహాం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఐదేళ్ల కిందట అనంతపురానికి వచ్చి స్థిరపడ్డాడు. అప్పటి నుంచి పలు టీవీ చానళ్ల పేర్లు చెబుతూ డబ్బు వసూలు చేసేవాడు. తాజాగా చిన్మయనగర్‌లో ప్రైవేట్ వైద్యుడు రఫీని బెదిరించి రూ.25 వేలు డిమాండ్ చేసి చివరకు రూ.4,700 వసూలు చేశాడు. గతంలో కూడా టీవీ 9 చానల్ పని చేస్తున్నానంటూ తపోవనంలోని ఓ ఆర్‌ఎంపీ లేడీ డాక్టర్ నుంచి రూ.7 వేలు వసూలు చేసినట్లు ఎస్‌ఐ తెలిపాడు. పాఠశాలలు, చౌకధాన్యపు కేంద్రాల్లో కూడా డబ్బు లేదా సరుకులు కూడా తీసుకెళ్లేవాడన్నారు. గుల్జార్ పేటలోని శరవణా మెడికల్ స్టోర్‌లో వారి వద్ద నుంచి ఒక మొబైల్‌ఫోన్ కూడా తీసుకున్నట్లు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








