News

స్పీకర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు


పార్టీ ఫిరాయింపులపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే సంపత్‌‌కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ ‌దాఖలు చేశారు. సంపత్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ కురియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పీకర్‌కు‌, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.